Header Banner

మర్డర్‌ కేసులో ప్రముఖ హీరోయిన్ అరెస్ట్..! పీకల్లోతు చిక్కుల్లో..!

  Mon May 19, 2025 14:13        Cinemas

బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ నటి నుస్రత్ ఫరియాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ మర్డర్‌ కేసుకు సంబంధించి ఆ దేశ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా నటి ఫరియా థాయ్‌లాండ్‌కు వెళుతుండగా ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది జులైలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఓ విద్యార్ధి హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నటి ఫరియాతోపాటు 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు వచ్చాయి. ఈ కేసు కారణంగా ఆ దేశ అద్యక్షురాలు షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోవడంతోపాటు ఆమె పార్టీకి చెందిన పలువురు నేతలపై రకరకాల కేసులు నమోదైనాయి. ఇక హసీనా దేశ వదిలి పారిపోయి భారత్‌లో తలదాచుకున్న సంగతి తెలిసిందే.

ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు తమ బృందం ఎయిర్‌ పోర్టులో నటి ఫరియాని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ అధికారి సుజన్ హక్ తెలిపారు. కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించిన విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆమెపై పతరా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలిపారు. అరెస్టు తర్వాత నటిని వతారా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఆమెను అక్కడ కస్టడీలో ఉంచడానికి బదులుగా, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (DMP) డిటెక్టివ్ బ్రాంచ్ (DB) కార్యాలయానికి తరలించినట్లు ప్రోథోమ్ అలో వర్గాలు తెలిపాయి.

ఆషికి (2015) మువీతో కెరీర్‌ ప్రారంభించిన ఫరియా.. అందులో ఆమె అంకుష్ హజ్రా సరసన ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఆ తర్వాత హీరో 420 (2016), బాద్షా – ది డాన్ (2016), ప్రేమి ఓ ప్రేమి (2017), బాస్ 2: బ్యాక్ టు రూల్ (2017) వంటి పలు వరుస హిట్ మువీల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. 2023లో బంగ్లాదేశ్ మొదటి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా నిర్మించిన ‘ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్’లో షేక్ హసీనా పాత్రను నటి ఫరియా పోషించింది. దిగ్గజ శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్, భారత్‌ కలిసి నిర్మించాయి. ఇందులో అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ActressArrested #MurderCaseShock #CelebrityScandal #BreakingNews #CrimeNews #TollywoodNews